'సత్యం' రాజు అరెస్టు తప్పదా?

Ramalinga Raju
హైదరాబాద్: సత్యం రామలింగరాజు అరెస్టు అనివార్యంగా కనిపిస్తోంది. సత్యం' ఖాతాల కుంభకోణంలో కంపెనీ మాజీ తప్పును ఆయనే స్వయంగా అంగీకరించడం, ఈ వ్యవహారం అంతా లిఖితపూర్వకంగానే ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా అభియోగాలు నమోదు చేయవచ్చు. కొంత ఆలస్యంగా అయినా రామలింగరాజు అరెస్టు తప్పకపోవచ్చని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో డైరెక్టర్ల పాత్ర ఉన్నట్లు తేలితే వారినీ అరెస్టు చేస్తారని ఆయన వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి ఈ కేసు దర్యాప్తు ఎవరు చేస్తారన్నది సందిగ్ధంగా మారింది. సీబీసీఐడీకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రకటించినప్పటికీ అది అంత సులువు కాదని పోలీసులే చెబుతున్నారు. ఇటువంటి వ్యవహారాల్లో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌(ఆర్‌.ఒ.సి.) ప్రాథమికంగా దర్యాప్తు జరిపి, వెల్లడయిన విషయాల ఆధారంగా పోలీస్‌స్టేషన్లో కేసు దాఖలు చేస్తుంది. అయితే ఇది రూ.వేలకోట్ల వ్యవహారం కావడంతో ఇటువంటి వాటికోసమే ఏర్పాటు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో తీవ్రమైన ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఇది కూడా వీలుకానిపక్షంలో కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం చొరవ తీసుకొని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చు. అప్పుడు చెన్నైలోని సీబీఐ ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు మొదలుపెడుతుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.

రామలింగరాజు రాజీనామా వ్యవహారం బయటపడగానే సెబీ, ఆర్వోసీలతోపాటు కేంద్ర ఆర్థికశాఖ అప్రమత్తమైంది. వెనువెంటనే చర్యలు మొదలుపెట్టింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ సీబీసీఐడీతో దర్యాప్తు చేయిస్తామని చెప్పడంతో గందరగోళానికి దారితీసింది. ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కావడం, సత్యం సంస్థ నిర్వహిస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలకు ప్రభుత్వం సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారంలో పారదర్శకంగా ఉన్నామని చెప్పుకునేందుకే ముఖ్యమంత్రి తొందరపడి సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించి ఉంటారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

ఇటువంటి కుంభకోణాన్ని రాష్ట్రానికి చెందిన పోలీసు విభాగం దర్యాప్తు చేయవచ్చా? లేదా? అన్న దానిపైనా స్పష్టత లేదు. ఎవరైనా వాటాదారులు సత్యం సంస్థ తమను మోసం చేసిందని ఫిర్యాదు చేస్తే మాత్రం ఆలోచించాల్సి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్వోసీ అధికారులు తమ ఏర్పాట్లు మొదలుపెట్టారు. మొత్తం పరిస్థితిని వివరించమని కోరుతూ నోటీసులు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు అందలేదని రాష్ట్ర సీఐడీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+