సత్యంపై అమెరికాలో కేసు
న్యూఢిల్లీ: అమెరికా చట్టాలను ఉల్లంఘించినందుకు సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు పై న్యూయార్క్ కోర్టులో కేసు నమోదైంది. తప్పుడు సమాచారం ఇచ్చి క్లయింట్లను తప్పుదోవ పట్టించినందుకు సత్యం అధికారులపై ఇజార్డ్ నోబెల్ ఎల్‌ఎల్‌పి అనే సంస్థ న్యూయార్క్‌లోని ఓ కోర్టులో కేసు వేశారు. అమెరికా చట్టాల ప్రకారం కేసు నిరూపితమైతే నిందితులకు కనీసం 24 ఏళ్ల జైలుశిక్ష, బిలియన్ డాలర్ల జరిమానా విధించవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications