చెన్నై:రాహుల్ ప్రధాని అయ్యే రోజు మరెంతో దూరంలో లేదని ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. గురువారం చెన్నయ్‌లో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో పాల్గొన్న ప్రణబ్ వేదికపైనుంచే ఈ వ్యాఖ్యలు చేసారు. రాహుల్‌ను భావిప్రధానిగా, కాంగ్రెస్ ఆశాజ్యోతిగా విదేశాంగశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభివర్ణించారు. కాగా రాహుల్ సూపర్‌స్టార్ అంటూ సీనియర్ నేత వీరప్పమొయిలీ పొగడ్తలతో ముంచెత్తారు. 'అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా భారత్' అన్న సదస్సులో ప్రసంగించిన ప్రణబ్ భారత భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు.