సత్యం బోర్డు మారుస్తాం:మంత్రి గుప్తా
హైదరాబాద్: కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రి గుప్తా.. మరో వారం రోజుల్లో సత్యం కంపెనీకి కొత్త బోర్డును నియమిస్తామని ఈ రోజు (శనివారం) స్పష్టం చేశారు. ఈ నిర్ణయం అమలు చేసేందుకు లా బోర్డు అనుమతి పొందామని, సత్యం కంపెనీ కొత్త బోర్డులో పారదర్శక విధానం పాటిస్తామని ఆయన చెప్పారు. రాజు రాజీనామాతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సత్యం కంపెనీ కొత్త సిఈఓ రాకతో ..లోపాలను కప్పిపుచ్చి, కంపెనీని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించుకుని ఆయన నేతృత్వంలో సంక్షో భ నివారణ బృందం తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే వీరి వ్యవహార శైలిపై పలు అనుమానాలు వ్యక్తం కావడం, ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా కంపెనీని తమ చేతుల్లోకి తీసుకో వాలని నిర్ణయించిన్నట్లు కంపెనీ వ్యవహారాల మంత్రి గుప్తా వివరించారు.












Click it and Unblock the Notifications