హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈనెల 22నుంచి అంటే గురువారం నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈనెల 22, 23, 24 తేదీల్లో ఆయన విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు విజయనగరం జిల్లా చింతలపల్లినుంచి ఆయన పర్యటన ప్రారంభమై 24న బలిజపేటలో ముగుస్తుంది. మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకున్న ఉత్సాహంలో చంద్రబాబు నాయుడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి ఉత్తరాంధ్రలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని చీల్చి చెండాడమే ఆయన ప్రధాన ఎజెండాగా ఉండబోతోంది.