హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు బెయిలు పిటీషన్‌పై విచారణను నాంపల్లి కోర్టు ఈనెల 27కు వాయిదావేసింది. కంపెనీ సిఎఫ్ వో వడ్లమాని శ్రీనివాస్ బెయిల్ విషయంలో కూడా ఇదే వాయిదా పడింది. శుక్రవారం రామలింగరాజును సీఐడీ అధికారులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనల అనంతరం కేసు తదుపరి విచారణను కోర్టు 27కు వాయిదావేసింది. దీనిపై నిర్ణయాన్ని మెజిస్ట్రేట్ ఈనెల 28న వెలువరిస్తారు. దీంతోపాటే సెబి కేసును కూడా 27కు వాయిదావేశారు. రామలింగరాజు సోదరుడు రామరాజు బెయిలు పిటీషన్ పై వాదోపవాదాలు ముగిశాయి. ఆయన బెయిల్ పై త్వరలో నిర్ణయం వెలువడనుంది.