ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య
కరీంనగర్: జిల్లాలోని సుల్తానాబడాద్ మండలం సుగ్లాంపల్లిలో ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిలో ఇద్దరు మరణించగా, మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరు ముగ్గురూ క్లోజ్ ప్రెండ్స్ అని ఏదిచేసినా కలిసే చేసేవారని అక్కడ స్ధానికులు అంటున్నారు. ఇక ఈ దుర్ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం. వారిలో ఒకమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి సెటిల్ చేసారని అదే ఈ దారుణాణికి కారణమవ్వచ్చునని తెలుస్తోంది. అయితే వారి తల్లితండ్రులు అటువంటిదేమీ లేదంటున్నారు. మరో ప్రక్క వారి సూసైడ్ నోట్ లో సంతకాలపై అనుమానాలు చెలరేగుతున్నాయి. అవి వారు పెట్టినవి కాదని కొందరు వాదిస్తున్నారు. పోలీసులు చేరుకుని కేసుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications