గాంధీజీకి ఉందా? పవన్

ఇక తెలంగాణపై ప్రజారాజ్యానికి స్పష్టత లేదంటూ టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రంగా స్పందించారు. ఆ పార్టీకి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు. తమ స్పష్టతను ప్రశ్నించే ముందు టీఆర్‌ఎస్‌కు ఉన్న స్పష్టత ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.అలాగే ప్రత్యేక తెలంగాణపై టీఆర్‌ఎస్‌కే స్పష్టత లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్‌తో అధికారం పంచుకున్న టీఆర్‌ఎస్‌కు ఏం స్పష్టత ఉన్నదని ప్రశ్నించారు. తెలంగాణ సమస్యను ఆత్మగౌరవ సమస్యగా పేర్కొన్న తొలి వ్యక్తి చిరంజీవేనన్నారు.












Click it and Unblock the Notifications