ప్రతీ గడపకూ 'ప్రజారాజ్యం'

నిద్రాహారాలు పక్కనబెట్టి పనిచేయండి. ఇంత గొప్ప అవకాశం ఇంకెప్పుడూ రాదు. ప్రతి ఇంట్లో ప్రజారాజ్యం మాట తప్ప మరేదీ వినిపించకూడదు. ప్రజల్లో నిశ్శబ్ద విప్లవముంది. గమనించండి. అయోమయ పరిస్థితి వద్దు'.. అంటూ ఆయన పార్టీ శ్రేణులకు ఉద్భోదించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయని ఆయన విమర్శించారు. సత్యం, మేటాస్‌లలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎంత పాత్ర ఉందో అందరికీ తెలుసని ఆయన ఆరోపించారు.
ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు అని ఒకప్పుడు చెప్పిన బాబు.. నేడు అన్ని ఉచితం అంటున్నారు. ఆయన హామీలకు అమెరికా బడ్జెట్ కూడా చాలదేమో!'' అని ఎద్దేవా చేశారు. "చిరంజీవి ఉన్నాడు. గెలిచేస్తాం!'' అని అనుకోవద్దని శ్రేణులను హెచ్చరించారు.
ఇక పదవుల్లేవనే అసంతృప్తి అక్కడక్కడా ఉంది. దీనిపై కొందరు మారాం చేస్తున్నారు. వీరు మనస్ఫూర్తిగా గొడవ చేస్తున్నారని అనుకోను. నాకు పార్టీ ఏమిచ్చింది అనుకోకుండా నేను పార్టీకి ఏమిటి? ఎలా సాయపడగలనని ప్రశ్నించుకోవాలి'' అంటూ సూచించారు. రూ.వందకు వంటింటి సరుకులు ప్రజాకర్షక పథకం కాదని, ప్రజా అవసర పథకమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications