సిఎం టూర్ కు అడ్దంకి, కోడెల అరెస్ట్
గుంటూరు: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జిల్లా పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గుంటూరు జిల్లాలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం ఈరోజు నిజాంపట్నంనుంచి మంగళగిరి వరకు 7 నియోజకవర్గాల్లో రాజీవ్ పల్లెబాట, నగరబాట కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈలోగా అమృతలూరులో టీడీపీ రాజకీయ సమ్మేళనాన్ని ఏర్పాటుచేసింది. ఇది సీఎం పర్యటనకు అడ్డుగా ఉంటుందంటూ పోలీసులు టీడీపీ సీనియర్‌నేత కోడెల శివప్రసాదరావు, మాజీమంత్రి ఆలపాటి రాజా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు తదితరులను అరెస్టుచేసి నగరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో కార్యకర్తలంతా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications