అబూసలేం కేసు వాయిదా
హైదరాబాద్: మాఫియా డాన్ అబూసలేం నకిలీ పాస్‌పోర్టు కేసును వచ్చే నెల 27కు వాయిదా వేశారు. ఈ ఉదయం ముంబాయి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి అబూసలేంను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అతనిపై ఉన్న కేసులకు సంబంధించి అన్ని పత్రాలతో సమగ్ర నివేదికను సమర్పించాలనికోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు కోర్టును నెలరోజుల గడువు అడిగారు.
ఇక ఈ కేసులో సీబీఐ అధికారులే కావాలని నన్ను ఇరికించారు. విదేశాల్లో ఉన్న నేను నకిలీ పాస్‌పోర్టును ఎలా తీసుకుంటాను అని అబూ సలేం అన్నాడు. అనారోగ్యంగా ఉన్నందును కేసు విచారణ సమయంలో తనను హైదరాబాద్‌లో ఉంచమని అబూసలేం న్యాయమూర్తిని కోరినట్లు తెలిసింది.సీబీఐ వారికి సమయం ఇచ్చేందుకు కోర్టు ఈ కేసు విచారణను వచ్చే నెల 27కు వాయిదావేసింది.












Click it and Unblock the Notifications