ఫ్యాక్టరీలో ప్రమాదం: ఇద్దరు మృతి
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఎస్ వి ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నరకు అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలడంతో ప్రమాదం సంభవించినట్లు తెలియవచ్చింది. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి. ఎంతమేరకు ఆస్తి నష్టం సంభవించింది తెలియరాలేదు. అయితే మృతిచెందిన, గాయపడిన వారి వివరాలు యాజమాన్యం తెలియజేయలేదు.












Click it and Unblock the Notifications