వాచ్ మన్ దారుణ హత్య
హైదరాబాద్: హైదరాబాద్‌లోని అబీడ్స్ జనరల్ పోస్టాఫీస్‌లో వాచ్‌మన్ బాబురావు దారుణ హత్యకు గురయ్యారు. గర్తుతెలియని దుండగులు ఈ సంఘటనకు పాల్పడి పోస్టాఫీస్ నుంచి రూ. 9లక్షల నగదు దోచుకువెళ్లినట్లు సమాచారం. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీంలు రంగంలోకి దిగాయి.
బాబూరావు హత్య మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట, రెండు గంటల మధ్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. బాబూరావు సోమవారం ఆరు గంటలకు విధులకు వచ్చారు. అయితే బాబూరావు రెగ్యులర్ వాచ్ మన్ కారు. మంగళవారం ఒక్క రోజుకు మాత్రమే ఆయన విధులకు వచ్చారు. ఈ హత్యపై పోలీసులు కూపీ లాగుతున్నారు.












Click it and Unblock the Notifications