ప్రజారాజ్యానికి కఠారి గుడ్‌బై
హైదరాబాద్: ప్రజారాజ్యం అనేది సినిమా పేరని, అందులో చిరంజీవి హీరో అయితే ఆయన బావమరిది అల్లు అరవింద్ దర్శక, నిర్మాత అని మాజీమంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్ విమర్శించారు. ప్రజారాజ్యంలో బంధుప్రీతి, పక్షపాతం ఎక్కువయ్యాయని దీంతో తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే పార్టీలో సామాజిక న్యాయం అనేది ప్రచారానికి మాత్రమే పరిమితమవుతోందని..ఏమాత్రం అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. అలాగే పార్టీ ఆఫీసుకాదు..ప్రొడక్షన్ యూనిట్ అని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో సీట్లను వేలం వేస్తున్నారు అని ఆరోపించారు. ఇంకా భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అలాగే పార్టీలో ఇంత జరుగుతున్నా ఏమీ తెలియనట్టు చిరంజీవి నటిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications