సత్యం కొత్త సీఈవోగా మూర్తి
హైదరాబాద్: సత్యం సంస్ధ కొత్త సీఈవోగా అచ్యుతని శ్రీనివాస మూర్తిని(ఏఎస్ మూర్తి)నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డైరక్టర్ల బోర్డు గురువారం ప్రకటించింది. ప్రత్యేక సలహాదారులుగా మేనేజ్ మెంట్,ఫైనాన్షియల్ రంగాల్లో దిగ్గజాల్లాంటి ఖుస్రోఖాన్, పార్ధోదత్తాను ఎంపికచేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సంస్ధ తక్షణ అవసరాలకు ఆరు వందల కోట్లు బ్యాంకు రణాల ఏర్పాటు కూడా పూర్తయినట్లు వివరించింది.
ఈ సందర్భంగా ఏఎస్ మూర్తి మాట్లాడుతూ మేం సాధించాల్సింది తక్కువ విషయమేమీ కాదు. ఈ విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మా లక్ష్యాలను నిర్ణయించుని, ఆ దిశగా మా ప్రయాణం పెట్టుకుంటాం. నిర్ణీత కాల వ్యవధిలో ఆ లక్ష్యాలను సాధించేందుకు సమిష్టి కృషి చేస్తాం అన్నారు. రామలింగరాజుకు సన్నిహితుల్లో ఒకరైన మూర్తి కంపెనీ గ్లోబుల్ డెలివరీ యూనిట్ హెడ్ గా ఉన్నారు. స్కామ్ బయిటపడ్డాక ఏర్పాటైన కోర్ టీమ్ లోనూ మూర్తి ఒకరు.


Click it and Unblock the Notifications