పాక్ కోర్టు సంచలన తీర్పు
ఇస్లామాబాద్: చిరకాలంగా గృహ నిర్బంధంలో ఉన్న పాకిస్థాన్ అణు శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్‌కు తిరిగి జనజీవితంలోకి ప్రవేశించే అనుమతి దొరికింది. పాక్ ప్రభుత్వం ఆయనపై విధించిన నిబంధనలను సడలిస్తూ, ఆయనను స్వేచ్ఛగా వదిలివేయాలని సూచిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఈరోజు సంచలన తీర్పునిచ్చింది. పాకిస్థాన్ అణు రహస్యాలను ఇతర దేశాలకు చేరవేశారన్న ఆరోపణలపై ఖాన్‌ను ప్రభుత్వం దేశద్రోహ నేరంగా పరిగణించి రెండు వేల నాలుగు నుంచి ఆయన్ని గృహ నిర్బంధంలో ఉంచింది. అయితే తనపై విధించిన ఆంక్షలను సడలించాలని కోరుతూ ఏక్యూ ఖాన్ హైకోర్టులో దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక ఖాన్‌కు అత్యున్నత స్థాయి రక్షణ కల్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో దేశంలో ఎక్కడైనా తిరగడానికి ఖాన్‌కు అనుమతినిచ్చింది. ఇది మానవ హక్కుల విజయంగా చాలా మంది పరిగణిస్తున్నారు.












Click it and Unblock the Notifications