మార్చి 12 నుంచి ఎన్టీఆర్ రోడ్ షోలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేయడానికి ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమానికి తుది రూపు ఇచ్చారు. ఆయన వచ్చే నెల 12 నుంచి తన రోడ్ షోలను మొదలు పేడతారు. శ్రీకాకుళం నుంచి ఆయన రోడ్ షోలు ప్రారంభమవుతాయి. తొలుత ఆయన తన తాత ఎన్టీ రామారావు స్వగ్రామం నిమ్మకూరు వెళ్తారు. అక్కడ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించి శ్రీకాకుళం వెళ్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం తన అభిమానులతో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications