నా కొడుకును జైల్లో పెట్టండి: బాబు
హైదరాబాద్: తమ అబ్బాయి లోకేష్ చదువు విషయంలో అవినీతి జరిగిందని రుజువైతే తన కొడుకును జైల్లో పెట్టండని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. లోకేష్ చదువు విషయంలో అక్రమాలు జరిగాయని ఆర్థిక మంత్రి కె. రోశయ్య చేసిన ఆరోపణలకు ఆయన సోమవారం తీవ్రంగా ప్రతిస్పందించారు. తమ ప్రభుత్వం హయాంలో సత్యం కంప్యూటర్స్ ఎంతో ప్రగతి సాధించిందని ఆయన అన్నారు.
లోకేష్, సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు కుమారుడు ఒకే గదిలో ఉండి చదువుకున్నారని కథనాలు వినిపిస్తున్నాయని, తమ వాదన వినడానికి ప్రతిపక్షాలకు ఆత్మస్థైర్యం కావాలని రోశయ్య అన్నారు. లోకేష్ చదువుకు పెట్టిన డబ్బులపై చంద్రబాబు వివరణ ఇవ్వాల్సి వస్తుందని ఆయన అన్నారు. లోకేష్ విదేశీ చదువులు ఎలా సాగాయో చెప్పాలని ఆయన అన్నారు. చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉంటాడనే విషయం అందరికీ తెలుసునని ఆయన అన్నారు. తమ అబ్బాయి ఎంతో డబ్బు అత్యంత ప్రధానమైన విశ్వవిద్యాలయంలో ఎలా చదివారో తేలాలని ఆయన అన్నారు. లోకేష్ విదేశీ చదువులపై జవాబు చెప్పాల్సి వస్తుందనే శాసనసభలో చర్చను తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications