పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగడం
ఆదిలాబాద్: అభిమానుల అత్యుత్సాహంతో యువరాజ్యం అధినేత పవన్ కళ్యాన్ మంచిర్యాల సభ ఆర్థాంతరంగా ముగిసింది. యువరాజ్యం అధినేత పవన్‌కల్యాణ్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన సోమవారం కూడా కొనసాగింది. మంచిర్యాలలో అభిమానుల శృతి మించి ఆగడం చేశారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ప్రారంభించిన దగ్గరనుంచి అభిమానుల కేరింతలు మొదలై తారాస్థాయికి చేరాయి. పవన్ మాటలను కూడా వారు పట్టించుకోలేదు. వారు మీడియా గ్యాలరీలోకి చొరబడటంతో కుర్చీలు విరిగిపోయాయి. పోలీసులు కూడా చేతులెత్తేశారు. తీవ్ర తొక్కిసలాట జరిగింది. దీంతో పవన్ సభను అర్థంతరంగా ముగించారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా పర్యటన సోమవారం ముగుస్తుంది.












Click it and Unblock the Notifications