హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్, అతని భార్య భాగ్యలక్ష్మి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ సోమవారం వారికి విడాకులు మంజూరు చేసింది. విడాకులు ఇచ్చినందుకుగాను వేణుమాధవ్ తన భార్య, ఇద్దరు మైనర్ పిల్లలకు కలిపి రూ.60 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. వేణుమాధవ్ తెలుగు సినిమాల్లో హాస్యనటుడిగా మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.