సత్యం సంస్ధకు మంచి ప్రాజెక్టు
హైదరాబాద్: కుంభకోణంలో కూరుకుపోయిన సత్యం కంప్యూటర్స్ సంస్థ మరో కొత్త ప్రాజెక్టును కైవసం చేసుకుంది. నిర్మాణ రంగానికి చెందిన ప్రాజెక్టు సత్యం సంస్థకు దక్కడం విశేషం. అగ్ని ప్రమాదాలను నివారించే సాంకేతిక పరిజ్ఞానాలు, ప్రఖ్యాత అధునాతన భవన నిర్మాణ భద్రతా వ్యవస్థల రంగంలో సత్యం సంస్థకు సరికొత్త ప్రాజెక్టు లభించింది. ఇదివరకు ప్రపంచ వ్యాప్తంగా సత్యం సంస్థకు 15 ప్రాజెక్టులు లభించిన విషయం విదితమే. ఒప్పందం జరిగిన నాటి నుండి దాదాపు 22 వారాల్లో అమెరికా వ్యాప్తంగా 14 ప్లాంట్లలోగల పైలట్ ప్రాజెక్టులను పూర్తి చేయవలసి ఉంటుందని కంపెనీకి చెందిన ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.
సత్యం కంపెనీ ఖాతాదారుల్లో ఒకరైన ప్రముఖ అమెరికా ఆయిల్ కంపెనీ ఒక మోస్తరు రేట్లను పెంచి సత్యం కంపెనీతో ఒప్పందాన్ని పునరుద్దరించుకోవడమే కాకుండా సత్యం భవిష్యత్‌పై తన విశ్వాసాన్ని ప్రకటించినట్టు వారు పేర్కొన్నారు. ఈ నెల చివర్లో కంపెనీకి ప్రపంచవ్యాప్తంగానున్న ఖాతాదారులతో ఒకరి తర్వాత ఒకరితో కొత్త చైర్మన్ సంప్రదింపులు జరుతారని కూడా వారు పేర్కొన్నారు. మెజారిటీ ఖాతాదారులు సత్యం కంప్యూటర్స్ సంస్థ పట్ల విశ్వాసం ప్రకటించారని, ప్రాజెక్టులను సకాలంలో అందించడంలో తేడా వస్తేనే ప్రాజెక్టుల కేటాయింపులపై సమీక్షజరుపుతామని తెలిపినట్లు సంస్థ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications