సత్యం కోసం సెబి రాజీ ఫార్ములా
ముంబాయి: సత్యం సంస్థ టేకోవర్ నిబంధనలు సడలిస్తూ శనివారం సెబీ నిర్ణయం తీసుకున్నది. సత్యం సంక్షోభ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆ కంపెనీకి మాత్రమే ప్రత్యేకంగా టేకోవర్ నిబంధనలు సడలించినట్లు సెబీ వర్గాలు వెల్లడించాయి. దీనితో ఎల్ అండ్ టి కంపెనీకి సత్యం కంపెనీనీ టేకోవర్ చేసే అవకాశాలు మెరుగుపడ్డాయి.
సత్యం కంపెనీ రూ.8,000 కోట్ల లేని లెక్కలను ఉన్నట్లు చూపించిందని ఆ సంస్థ ఛైర్మన్ రామలింగరాజు బాహ్య ప్రపంచానికి వెల్లడించడంతో కంపెనీ సంక్షోభంలో చిక్కుకోవడం తెలిసిందే. దీనితో బహిరంగ మార్కెట్లోని షేర్లను భారీగా కొన్న ఎల్ అండ్ టి తో పాటు స్పైస్, మహీంద్రా తదితర కంపెనీలు కూడా సత్యం టేకోవర్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయి.












Click it and Unblock the Notifications