ఏలూరు: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈరోజు రేపు ఆయన జిల్లాలో ఉండి పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈరోజు పెనుమంట్రలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారు. అనంతరం పట్టాలను పంపిణీ చేస్తారు. గోస్తనీ నది డ్రెయిన్‌పై వంతెనకు శంకుస్థాపన చేస్తారు. ఓ స్కూలు భవనాన్ని, మంచినీటి పథకాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం ఏలూరులో బహిరంగసభలో పాల్గొంటారు.