ఎసిబి సోదాలు: కోట్లలో ఆస్తులు
హైదరాబాద్: నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఇళ్లపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డాడులు జరిగాయి. నిజామాబాద్ నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఎల్.రాజేశ్వర్‌రెడ్డి ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగిఉన్నారనే ఆరోపణలతో ఈ దాడులు జరిగాయి. హైదరాబాద్, నిజామాబాద్‌లలోని ఆయన ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఇప్పటివరకు 7.5 లక్షల నగదు, 100 తులాల బంగారం దొరికినట్లు తెలుస్తోంది. దాడులు కొనసాగుతున్నాయి.
ఆదిలాబాదు జిల్లాలోని ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. నిజమాబాద్ జిల్లాలో ఆయనకు వందల ఎకరాల భూములు ఉన్నట్లు ఎసిబి అధికారుల దృష్టికి వచ్చింది. భూముల విలువ ప్రభుత్వ ధర ప్రకారం 90 లక్షల రూపాయలు ఉంటుంది. మార్కెట్ రేటు ప్రకారం 3 కోట్ల రూపాయల దాకా ఉంటుందని చెబుతున్నారు. రాజేశ్వర రెడ్డికి మూడు బ్యాంకు లాకర్లు కూడా ఉన్నాయి. అవి తెరిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications