రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని ఎల్బీ నగర్ వద్ద గల మన్సూరాబాదులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండో తరగతి చదువుతున్న లావణ్య అనే బాలిక మరణించింది. నాలుగో తరగతి చదువుతున్న లత గాయపడింది. జెసిబి వాహనం అదుపు తప్పి బస్సు స్టాపులో నించున్న ప్రయాణికుల మీదికి దూసుకు రావడంతో ఈ ప్రమాదం సంభవించింది.
లావణ్య, లత అక్కాచెల్లెళ్లు. పాఠశాల బస్సు తప్పిపోవడంతో ఎల్బీ నగర్ లోని పాఠశాలకు ఆర్టీసి బస్సులో వెళ్లడానికి స్టాపులో నించున్నారు. ఈ సమయంలో వారి మీదికి జెసిబి వాహనం దూసుకొచ్చింది. వాహనాన్ని చూసిన ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే ఆ ఇద్దరు చిన్నారులు మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈ ప్రమాదానికి స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. జెసిబి డ్రైవర్ పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications