లక్ష కోట్ల అస్తి అంటారు: వైయస్

ముఖ్యమంత్రికి ముందే స్థానిక తెలుగుదేశం శాసనసభ్యుడు కడియం శ్రీహరి ధర్మసాగర్ వద్ద దేవాదుల నీటిని విడుదల చేశారు. దాంతో తెలుగుదేశం నాయకులపై పోలీసులు కేసు పెట్టారు. స్థానిక శాసనసభ్యుడి హోదాలోనే తాను నీరు విడుదల చేశానని శ్రీహరి చెప్పారు. తాము ప్రాజెక్టులు కడితే తెలుగుదేశం వారు నీరు విడుదల చేస్తారా అని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆ సంఘటనను ఉద్దేశించి అన్నారు. తెలుగుదేశంవారు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తాము నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులకు తెలుగుదేశం పార్టీ కుళ్లుకుంటోందని ఆయన అన్నారు.
తాము ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేశామని ఆయన చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వగలరా, పింఛన్లు ఇవ్వగలరా, ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు వైద్య సౌకర్యం అందించగలరా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకమైన సిపిఎంతో తెరాస ఎలా జత కడుతుందని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications