మంత్రి లోకేష్‌ను కలిసే ఛాన్స్.. అమ్మ ప్రేమతో అదిరిపోయే అవకాశం!
అమ్మ అంటేనే రెండక్షరాల ప్రేమకు ప్రతిరూపం. అలాంటి అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. పిల్లల చదువు కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలూ ఆరాటపడే వ్యక్తి ఒక్క అమ్మ మాత్రమే. అటువంటి అమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు, సమగ్ర శిక్షా విభాగం కలిసి చిన్నారులకు ఓ చక్కటి అవకాశాన్ని తీసుకువచ్చాయి. ఈ అవకాశం చిన్నారులకు మాత్రమే.
చేయాల్సింది 60 సెకన్లు వీడియోనే!
ఈ పోటీలో పాల్గొనడం చాలా సులభం. మీ జీవితంలో అమ్మ పాత్ర, ఆమె గొప్పతనం, పిల్లల కోసం అమ్మ పడే తపనను వివరిస్తూ కేవలం 60 సెకన్ల నిడివి గల ఓ చిన్న వీడియోను తీయాలి. ముందుగా అమ్మ గొప్పదనం గురించి ఓ చోటరాసుకొని.. తర్వాత ఇంట్లో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ విషయాలను చెబుతూ వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది.

వీడియోలు పంపించే విధానం
చిన్నారులు తీసిన ఆ ముద్దు ముద్దు మాటల వీడియోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్ సైట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. లేదా పోస్టర్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి నేరుగా వీడియోను అప్‌లోడ్ చేయవచ్చు.
వీడియోలు పంపించాల్సిన సైట్: ఈ లింక్‌పై క్లిక్ చేయండి
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిసే అవకాశం
చిన్నారులు పంపించే వీడియోలలో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసి ఆ చిన్నారులకు ఓ అరుదైన అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎంపికైన పిల్లలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను స్వయంగా కలిసే అద్భుత అవకాశం లభిస్తుంది. మంత్రి నారా లోకేష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మంత్రి చిన్నారులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.












Click it and Unblock the Notifications