మర్డర్ ప్లాన్ నుంచి శవాల ప్యాకింగ్ వరకు.. AI సాయంతో దారుణ హత్యలు!

కర్ణాటక రాజధాని బెంగళూరులోని కేఆర్ పురం పరిధిలోని సాయి గ్రీన్ హోం అపార్ట్మెంట్లో దారుణమైన ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల శ్వేత అనే యువతి, తన 25 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామి కెనెత్‌తో కలిసి కన్నతల్లి ముత్తులక్ష్మి, తండ్రి సోమసుందర్, చెల్లి సుప్రియలను దారుణంగా హత్య చేసింది. ఓ ఐటీ కంపెనీలో పనిచేసే శ్వేత.. గతంలో తన ఉద్యోగం పోవడంతో తల్లి వద్ద రూ.50 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బును శ్వేత తన ప్రియుడు కెనెత్ కోసం ఖర్చు చేసింది. అయితే తల్లి ఆ డబ్బును తిరిగి అడుగుతుందేమోనన్న భయంతో ఆ డబ్బును ఎగ్గొట్టేందుకు కన్నవారినే అంతం చేయాలని నిందితులు పన్నాగం పన్నారు.

6 నెలల పాటు ఏఐతో ప్లానింగ్
ఈ కిరాతకానికి ఒడిగట్టడానికి నిందితులు 6 నెలల క్రితమే ప్లాన్ చేశారు. టెక్నాలజీలో ప్రావీణ్యం ఉన్న శ్వేత, కెనెత్ లు నేరం చేసి పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఏఐ సహాయం తీసుకున్నారు. 6 నెలల పాటు ఏఐ సెర్చ్ ఇంజిన్లను వినియోగిస్తూ అనేక దారుణమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికారు. ఒకేసారి ముగ్గురిని ఎలా హత్య చేయాలి?, రక్తపు మచ్చలను తొలగించే కెమికల్స్ ఏమిటి? శవాలను ఎలా ప్యాక్ చేయాలి? క్లౌడ్ కిచెన్ భట్టీలలో మృతదేహాలను కాల్చి ఆధారాలు లేకుండా చేయవచ్చా? వంటి ప్రశ్నలు ఏఐ ద్వారా తెలుసుకుని హత్యలకు కావాల్సిన ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.

Bengaluru Triple Murder Case Daughter Uses AI to Plan and Execute Family Killing Full Details

హత్యలు జరిగిన తీరు
జూన్ 22న శ్వేత మొదట తన తల్లిని పిలిపించి ఓ ఫ్లాట్ లో ఆమెపై ప్రియుడు కెనెత్ తో కలిసి దాడి చేసింది. తల్లిపై ఏకంగా 26 సార్లు చాకుతో పొడిచి చంపేశారు. ఆ తర్వాత తండ్రిని, చెల్లిని కూడా అదే ఫ్లాట్‌కు పిలిపించి వారిపై కూడా విచక్షణా రహితంగా చాకులతో దాడి చేశారు. ముగ్గురూ చనిపోయారని భావించి తల్లి ఇంట్లోని నగదు, నగలను దోచుకుని పుదుచ్చేరి పరారయ్యారు.

నిజం బయటపడిందిలా..
అయితే తీవ్ర గాయాలపాలైన తండ్రి సోమసుందర్ ప్రాణాలతో బయటపడి ఎలాగోలా మెట్ల వరకు రాగా.. పొరుగున ఉన్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించే ముందు ఆయన తన కూతురు శ్వేత, ఆమె ప్రియుడు కెనెత్ ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ ఆధారంతో రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు పుదుచ్చేరిలో దాక్కున్న శ్వేత, కెనెత్‌లను అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. వారి ల్యాప్‌టాప్‌లను పరిశీలించగా.. ఏఐని ఉపయోగించి హత్యలకు వేసిన ప్లాన్లు, ఇతర వివరాలు బయటపడ్డాయి.

ఏఐపై క్రిమినల్ కేసు సాధ్యమేనా?
పోలీసులు ప్రారంభంలో ఈ కేసులో ఏఐ టెక్నాలజీని కూడా నిందితుడిగా చేర్చాలని ఆలోచించినప్పటికీ.. ప్రస్తుత భారతీయ చట్టాల ప్రకారం అది సాధ్యం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. క్రిమినల్ చట్టం ప్రకారం నేరం చేయాలనే ఆలోచన కేవలం వ్యక్తులకు కొన్ని రకాల సంస్థలకు మాత్రమే ఉంటుంది. ఓ టెక్నాలజీ పరికరానికి ఉండదు. అందువల్ల ఏఐ టెక్నాలజీని కేవలం డిజిటల్ సాక్ష్యంగా మాత్రమే పరిగణించి.. నేరానికి పాల్పడిన శ్వేత, కెనెత్ లపై విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+