హెలికాప్టర్ నుంచి గరిడి గణనాథుడిపై పూలవర్షం! 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా

హిందూపురం పట్టణం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. గణనాథుల నిమజ్జన శోభాయాత్ర ఆదివారం అత్యంత వైభవంగా, భక్తజన సందోహం నడుమ కోలాహలంగా సాగింది. బొజ్జ గణపయ్యను వీడ్కోలు పలికే ఘట్టాన్ని తిలకించేందుకు పట్టణ వాసులతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. 'జై గణేష్.. జై జై గణేష్' అంటూ భక్తులు చేసిన జయజయధ్వనులతో ప్రధాన రహదారులన్నీ మారుమోగిపోయాయి. పట్టణంలోని అత్యంత కీలకమైన ఎన్టీఆర్‌ సర్కిల్‌ భక్తజన సముద్రాన్ని తలపించగా, భక్తుల కోలాహలంతో వీధులన్నీ పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

స్వర్ణోత్సవ సంబరం.. 50 అడుగుల గరిడి గణేశుడికి ఘన నివాళి

ఈ ఏటి శోభాయాత్రలో ప్రధాన ఆకర్షణగా రైల్వే రోడ్డులోని 'గరిడి గణేష్' నిలిచారు. గరిడి గణేష్‌ కమిటీ ఆవిర్భవించి విజయవంతంగా 50 వసంతాలు పూర్తిచేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ఏకంగా 50 అడుగుల అత్యంత భారీ విగ్రహాన్ని ప్రతిష్టించి స్వర్ణోత్సవ సంబరాలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి అర్ధ శతాబ్ద కాలపు వేడుకలను పురస్కరించుకుని శోభాయాత్రలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి.

Helicopter Showers Flower Petals on 50-Foot Garidi Ganesh During Grand Immersion Rally in Hindupur

అంబరాన్నంటిన సంబరం.. ఆకాశం నుంచి పుష్పవృష్టి!

గణనాథుడి వీడ్కోలు ఘట్టంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ నిర్వాహకులు బెంగళూరు నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను తెప్పించారు. 50 అడుగుల గరిడి గణేశుడిపై ఆకాశం నుంచి హెలికాప్టర్ ద్వారా గులాబీ, పూల రేకులతో కురిపించిన పుష్పవర్షం భక్తులకు కన్నులపండువగా నిలిచింది. పుడమి తల్లి మైమరిచిపోయేలా సాగిన ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇళ్ల మేడలపైకి, రహదారులపైకి ఉత్సాహంగా తరలివచ్చారు. హెలికాప్టర్ నుంచి పూలవాన కురుస్తుండగా స్వామివారికి భక్తులు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తూ తారకమంత్రాలు జపించారు.

HYD Traffic Alert: నేటి నుంచి కొత్త రూల్స్, మధ్యాహ్నం 2 గంటలకే ఇంటికి!
HYD Traffic Alert: నేటి నుంచి కొత్త రూల్స్, మధ్యాహ్నం 2 గంటలకే ఇంటికి!

పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు

హెలికాప్టర్ పూలవర్షం శోభాయాత్రకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక దివ్యత్వాన్ని తీసికొచ్చిందని గరిడి గణేష్ కమిటీ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఊహించని రీతిలో భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తుగా వాహనాలను మళ్లించి నిమజ్జనోత్సవం ప్రశాంతంగా, వైభవంగా ముగిసేలా శాంతిభద్రతలను పర్యవేక్షించారు.

రాయలసీమలో ఇదీ పరిస్థితి.. నీళ్లు లేక వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయకుండానే..
రాయలసీమలో ఇదీ పరిస్థితి.. నీళ్లు లేక వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయకుండానే..

వెల్లివిరిసిన మతసామరస్యం

గణేష్ శోభా యాత్ర సందర్భంగా హిందూపురం పట్టణంలో మతసామరస్యం వెల్లివిరిసింది. నిమజ్జనానికి తరలివచ్చిన వేలాది మంది ప్రజలకు ముస్లీం సోదరులు పులిహోర, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్లు పంచి పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+