కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి కీ పోస్టింగులు: ఈ జిల్లాలకు నూతన ఎస్పీలు

ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీ సాయిప్రసాద్.. ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు బదిలీ అయిన వారిలో ఉన్నారు. అలాగే ముంబైకి చెందిన వివాదాస్పద నటి కాదంబరి జెత్వాని కేసులో సస్పెన్షన్‌కు గురై ఇటీవలే తిరిగి విధుల్లోకి చేరిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు కూడా పోస్టింగ్‌లు లభించాయి.

2004, 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. నటి కాదంబరి జెత్వాని, ఆమె కుటుంబ సభ్యులను నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధించి వేధించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వీరిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వివాదాస్పద కేసు అప్పట్లో పోలీస్ శాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇటీవలే ప్రభుత్వం వీరి సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. వీరిద్దరూ గతంలో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా పని చేసిన విషయం తెలిసిందే.

Kanthi Rana Tata and Vishal Gunni gets Postings and SP Appointments during IPS Officers transfers AP

దీంతో వీరిద్దరూ రీజాయిన్ అయినప్పటికీ.. అప్పట్లో పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాల్సందిగా ఆదేశించారు. తాజాగా చోటు చేసుకున్న బదిలీల నేపథ్యంలో వారికి పోస్టింగులు లభించాయి. కాంతి రాణా టాటాను ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియమించారు. విశాల్ గున్నీ ట్రైనింగ్ విభాగం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా అపాయింట్ అయ్యారు. మంగళగిరి పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా కూడా విశాల్ గున్నీకి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం.

పసిడి కాంతుల్లో తిరుమల- బ్రహ్మోత్సవాల్లో జర్మనీ కళకారులు
పసిడి కాంతుల్లో తిరుమల- బ్రహ్మోత్సవాల్లో జర్మనీ కళకారులు

ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని మరికొందరు కీలక అధికారుల స్థానాలు మారాయి. ప్రస్తుతం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్న 2005 బ్యాచ్ అధికారి త్రివిక్రమ్ వర్మ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఐజీ, డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఏసీబీ డైరెక్టర్‌ ఆర్ జయలక్ష్మి.. సీఐడీ సైబర్ క్రైమ్స్ విభాగం ఐజీగా నియమితులయ్యారు.

ఏపీ స్పెషల్ పోలీసు బెటాలియన్స్ ఐజీ బీ రాజకుమారి.. రైల్వే ఐజీగా బదిలీ అయ్యారు. ఆమెకు సీఐడీ మహిళా భద్రతా విభాగం ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు లభించాయి. ప్రస్తుతం ఈ స్థానం ఖాళీగా ఉంటోంది. అలాగే గ్రేహౌండ్స్ డీఐజీ బాబూజీ అట్టాడను టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా బదిలీ చేయగా, ఆయన ఖాళీగా ఉన్న గ్రేహౌండ్స్ డీఐజీగా కూడా అదనపు పూర్తిస్థాయి బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.

మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను కూడా నియమించింది ప్రభుత్వం. పోలవరం ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పంకజ్ కుమార్ మీనాను మార్కాపురం జిల్లా కొత్త ఎస్పీగా బదిలీ చేసింది. పల్నాడు, పోలవరం జిల్లా ఎస్పీలుగా జగదీష్ అడహళ్లి, కే చక్రవర్తి నియమితులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+