కర్నూలు: రాష్ట్రప్రభుత్వ అవినీతిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన టీడీపీ కూడా పలు ఆరోపణలను ఎదుర్కొంటోందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల అవినీతిపై తాము కూడా రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇస్తామని, వారి అవినీతిపై విచారణ కోరతామని చిరంజీవి అన్నారు. అవినీతిలేని రాజకీయాలే తమ లక్ష్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడినుంచి పోటీచేసేది ఇంకా నిర్ణయించలేదని ఆయన తెలిపారు.