రిజిస్ట్రార్ కార్యాలయంపై మాదిగల దాడి
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలు మూడవరోజుకు చేరుకున్నాయి. ఈరోజు కూడా వారు ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఈరోజు ఉదయాన్నే సికింద్రాబాద్‌లోని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దాడిచేసి కార్యాలయం అద్దాలను, బయట ఉన్న సామాన్లను ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications