బిజెపితో పొత్తు ఉండదు: చిరంజీవి

నిన్న కూడా చిరంజీవి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. 'సామాజిక న్యాయమని ఇప్పుడు అందరూ గొంతులు చించుకుంటున్నారు. ఇంతకాలం వీరికా ఆలోచన ఎందుకు రాలేద'ని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రశ్నించారు. ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు, ఆత్మకూరు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణచివేతకు గురైన వర్గాల వారికి అండగా నిలిచేందుకే ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశామని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయంపై ధృడమైన నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications