పీఆర్పీ నాయకుని దారుణహత్య
నెల్లూరు: నెల్లూరు జిల్లా ప్రజారాజ్యం కో-కన్వీనర్ ఉలవపాటి రమేష్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. శనివారం అపహరణకు గురైన రమేష్ ఈ రోజు ఉదయం ఆయన మృతదేహం వెంకటగిరి సమీపంలోని తెబ్బేరు వాగులో లభ్యమయింది. అలాగే ఆయనతో పాటు కిడ్నాప్‌కు గురైన ఆయన కుమారుడు కృష్ణతేజ సురక్షితంగా తప్పించుకున్నారు. వ్యాపార లావాదేవీలే రమేష్ హత్యకు కారణమని, తోటి వ్యాపారే రమేష్‌ను హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications