పవన్ కల్లుతాగి తొంగున్నాడా?
హైదరాబాద్: 'మేం ఉద్యమాలు చేస్తున్నపుడు పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నాడు? మందు, కల్లుతాగి నిద్ర పోతున్నాడా...తొంగున్నాడా... పోలవరంమీద పోట్లాడాం. ఖమ్మం జిల్లాలో ముంపు బాధితుల పక్షాన ఉద్యమాలు చేశాం. సామాజికన్యాయం కోసం సైకిల్ యాత్రలు చేపట్టాం. ఇవేవీ తెలియకుండా ఆయన మాట్లాడటం పొగరుబోతుతనం. కమ్యూనిస్టులను వ్యతిరేకించే దమ్ము, ధైర్యం, నిజాయితీ ఆయనవద్ద ఉన్నాయా? ఏయే నిర్మాత నుంచి ఎంత తీసుకున్నాడు, ఎంత బ్లాక్ మనీ, ఎంత వైట్ మనీ తీసుకున్నాడో లెక్కలు చెప్పమనండి' అని తీవ్రస్థాయిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విరుచుకుపడ్డారు.
మహాకూటమిపై ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న యువరాజ్యం నేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై బీవీ రాఘవులు పై విధంగా మండిపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన గిరిజనసదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ నెల 27న కొత్తగూడెం రానున్న సోనియాను సమస్యలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. కాగా చాడ వెంకట్ రెడ్డి(సీపీఐ) మాట్లాడుతూ..ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిన విషయాన్ని మరవరాదన్నారు. కాంగ్రెస్ కు మేలు చేసేందుకే మహాకూటమిపై పీఆర్పీ విమర్శలు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications