హైదరాబాద్: ఏ.ఆర్.రెహమాన్‌తో పాటు ఆస్కార్ బరిలో మరో భారత మెరుపు మెరిసింది. రెహమాన్‌తో పాటు కేరళకు చెందిన రసూల్ పోకుట్టి కూడా సౌండ్ ఎడిటింగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించారు. అంటే భారత్‌కు మూడు ఆస్కార్ అవార్డులను సాధించి పెట్టిన ఈ ఇద్దరూ దక్షిణ భారతదేశానికి చెందిన వారేనన్న మాట-. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే...ఆకట్టుకునే మరో ముఖ్యమైన అంశం సౌండ్ ఎడిటింగ్. దృశ్యానికి అనుగుణంగా తగు మోతాదులో వినిపించిన శబ్ధ సౌందర్యం రసూల్ పోకుట్టి ప్రతిభకు నిదర్శనం. ఈ అవార్డు తనకు శివరాత్రి కానుకని, దేశ పౌరునిగా ఈ అవార్డు రావడం తనకు గర్వకారణంగా ఉన్నదని పోకుట్టి అన్నారు.