గుజరాత్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున యువత క్రియాశీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి యువతే కీలకమని, ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ పర్యటనలో బాగంగా ఆయన గాంధీనగర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశ మయ్యారు. పార్టీలోకి యువతను పెద్దఎత్తున ఆకర్షించేందుకు వారితోనే ఎక్కువ సమయం కేటాయించారు. మరోవైపు యువకులు సైతం రాహుల్‌ను కలిసేందుకు, ఆటోగ్రాఫ్‌ల తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. అహ్మదాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు కచ్, రాజ్‌కోట్, పటాన్‌లలో సుడిగాలి పర్యటన జరిపారు. ఆయన పలువురు పార్టీ నేతలను కలుసుకున్నారు. కచ్ జిల్లాలోని భుజోడి ప్రాంతంలో నిర్వహించిన మహిళల సమా వేశంలో పాల్గొన్నారు.