హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు రేటింగ్ మరీ...వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: 'ఎవరి తిప్పలు వారివి. పాపం ఆయన రేటింగ్‌ మరీ అన్యాయంగా ఉంది' అంటూ చిరంజీవి పై ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానం చేసారు. ఒక టీవీ ఛానల్‌లో నిర్వహించిన 'ముఖ్యమంత్రితో ముఖాముఖీ' కార్యక్రమంలో అధికారంలోకి వస్తే చంద్రబాబు, వై.ఎస్‌ల అవినీతిపై విచారణ చేయిస్తానని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆయనిలా స్పందించారు.

అలాగే 'నా ఆస్తి 2004 ఎన్నికల నాటికి ఎంత ఉందో ఇప్పుడూ అంతే. అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఉండదు, ఆడిటర్లు అడిగితే కచ్చితంగా చెప్పగలరు. నాకు తెలిసి పది రూపాయలు అటుఇటుగా కూడా ఉండదు 'అని ఆయనతెలిపారు. ఇక తన కుటుంబానికి పదివేల కోట్ల రూపాయల మేర ఆస్తులున్నాయని ఇటీవల ఆరోపించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆ మొత్తాన్ని 50 వేల కోట్లకు పెంచారని..ఇలా పెంచుకుంటూ త్వరలోనే లక్ష కోట్లు అని అంటారేమోనని వ్యాఖ్యానించారు.

గతంలో రెండెకరాల భూమి, పూరిగుడిసెతో సంక్షేమశాఖ ఉపకార వేతనాలతో చదువుకున్న చంద్రబాబు ఆస్తి ఇప్పుడు కనబడేదే వెయ్యి నుంచి రెండువేల కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. ఈ ఆస్తులు ఎలా సమకూరాయో చెప్పాలన్నారు. చంద్రబాబుపై చేసిన అవినీతి ఆరోపణలు ఎందుకు రుజువు చేయలేకపోయారనే ప్రశ్నకు 'చట్టాల్లోని లొసుగులు వల్లే తప్పించుకుంటున్నారు' అని చెప్పుకొచ్చారు.

తన కుమారుడికి చెందిన పవర్‌ ప్రాజెక్టు 2000 సంవత్సరంలోనే ప్రారంభమైందని, 2003లోనే ఉత్పత్తి కూడా ప్రారంభించిందని వైఎస్‌ తెలిపారు. నిజంగా తనపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలలో పస ఉంటే సెబీ, ఆర్‌వోసీ, కంపెనీ వ్యవహారాల సంస్థలకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. వారి మాటలలో నిజమే లేనప్పుడు ఏమని వివరణ ఇస్తామని ప్రశ్నించారు.

ఇక సత్యం రామలింగరాజు గురించి వ్యాఖ్యానిస్తూ...ఆయన ఇక్కడ చట్టాల నుంచి తప్పించుకున్నా అమెరికా చట్టాలనుంచి తప్పించుకోలేరని అన్నారు. వందరోజుల్లో తెలంగాణ ఇస్తామని నరేంద్రమోడీ చెబుతున్నారు కద అంటే..బిజెపి అధికారంలోకి వస్తే కాదా! అని వైఎస్‌ ఎద్దేవా చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X