న్యూఢిల్లీ: అక్రమ ఆస్తుల కేసుల్లో కేంద్ర కమ్యూకేషన్‌స మాజీ మంత్రి సుఖ్ రామ్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఢిల్లీలోని తీస్ హజరీ కోర్టు తీర్పునిచ్చింది. ఆ నెల 20న సుఖ్‌రామ్‌ను దోషిగా ప్రకటించిన ఢిల్లీ తీస్‌హజరీ కోర్టు తీర్పు నిచ్చింది. 13 ఏళ్ల క్రితం టెలీ, కమ్యూనికేషన్ మంత్రిగా ఉన్న సుఖ్ రామ్ రూ.4.25 కోట్ల అక్రమాస్తులను సంపాదించారని సీబీఐ కోర్టులో వాదించింది. దీని నిమిత్తం 1997 ఆయనపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. పూర్వా పరాలు పరిశీలించిన న్యాయస్థానం సుఖ్ రామ్‌కు మూడేళ్ల శిక్షను ఖరారు చేసింది. కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని సుఖ్ రామ్ ఇప్పటికే చెప్పారు.