ఏడుపాయల జాతరలో రద్దీ
సంగారెడ్డి: తెలంగాణాలో సమ్మక్క,సారక్క జాతర తరువాత అంతటి ప్రాశస్త్యం ఏడుపాయల జాతరకు ఉంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వద్ద మంజీరా 7 పాయలుగా చీలిన ప్రాంతంలో వెలసిన వన దుర్గామాతను ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా మూడురోజులపాటు ఏటా ఇక్కడ జాతర జరుగుతుంది. ప్రభుత్వం దీన్ని రాష్ట్రోత్సవంగా ప్రకటించి నిర్వహిస్తోంది. రెండురోజులుగా జరుగుతున్న జాతరకు తెలంగాణా జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. నిన్న జరిగిన బండ్ల వూరేగింపు అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు చివరిరోజు కావటంతో భక్తులు పోటెత్తారు. ఈరోజు రథోత్సవంతో ఇక్కడ జాతర ముగుస్తుంది. దాదాపు 10 లక్షల మంది భక్తులు హాజరయినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications