టీవీ ఛానెల్ పై ఐటీ దాడులు
హైదరాబాద్: త్వరలో రానున్న'స్టూడియో ఎన్'ఛానెల్ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం విస్తృత స్ధాయిలో దాడులు నిర్వహించారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఐటీ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నార్నే రియల్ ఎస్టేట్ సంస్ధలతో పాటు, కొత్తగా ప్రారంభించనున్న స్టూడియో..ఎన్ కార్యాలయంపై కూడా దాడులు జరిపారు. దాడులకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడిస్తామని ఆ అధికారి పేర్కొన్నారు. నార్నే గ్రూపు సంస్ధల ఆస్తులను, ఆదాయానికి సంబంధించి తమకు అందిన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించినట్లు ఆయన వివరించారు. నార్నే గ్రూప్ ఛైర్మన్..చంద్రబాబు నాయుడుకి బంధువు అన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications