ఏం..సీఎం..గడ్డి పీకుతున్నారా?

హైదరాబాద్: '2007 ఏప్రిల్‌లో కుప్పం ప్రాజెక్టుపై నియమించిన విచారణ కమిషన్‌ నివేదిక ఇచ్చి రెండేళ్లయింది..అప్పటి నుంచి సీఎం, మంత్రులు సచివాలయంలో గడ్డి పీకుతున్నారా?' అని టీడీపీనేతలు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యు డు నాగం జనార్దనరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్‌ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, కే విజయరామారావు, వర్ల రామయ్య నిన్న (మంగళవారం) సాయంత్రం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

అధికారం అంత్యదశకు చేరుకున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని వారు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.న్యాయవిచారణ నివేదిక వచ్చిన రెండేళ్ళ తర్వాత ఇప్పుడు కుప్పం ప్రాజెక్టుపై సీబీసీఐడి విచారణ జరపాలని కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని, చంద్రబాబు సమీప బంధువు నార్నె శ్రీనివాసరావుపై ఐటీ దాడులను, కడియం శ్రీహరిపై కేసును ప్రస్తావించిన టీడీపీనేతలు ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు.

కుప్పం ప్రాజెక్టుపై సీబీ సీఐడి విచారణకు తామేమీ అభ్యంతరం చెప్పడంలేదని, ఇలాంటి వంద విచారణలు వేసినా భయం లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే తన నియోకజవర్గం నాగర్‌ కర్నూలులో నామినేషన్‌ వేయాలని నాగం జనార్దనరెడ్డి సవాలు చేశారు. ముఖ్యమంత్రి కేసులు పెడితే భయపడి రాజకీయాలు మానుకోబోమన్నారు.

రాష్ట్రంలో చేపట్టిన ఇజ్రాయిల్‌ సేద్యం ఆదర్శప్రాయంగా ఉందన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మరో విచారణకు ఎందుకు ఆదేశించారని వారు ప్రశ్నించారు. అవినీతిపై విపక్షాలు సీఎం బట్టలూడ దీశాయి. సిగ్గు విడిచి చివరి కేబినెట్‌లో బాబుపై విచారణకు ఆదేశించారని దుయ్యబట్టారు. 60 రోజులుపోతే వైఎస్‌ అందరినీ చంచల్‌గూడ జైలుకే తీసుకెళ్తారని, ఆయన కుటుంబ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినవారు కూడా కోర్టు బోను ఎక్కక తప్పదని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+