బస్సు బోల్తా: 30 మంది మృతి
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో 30 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు గాయాలపాలయ్యారు. కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. బద్వారా నుంచి జమ్ము వెళుతున్న బస్సు దోడా సమీపంలో గల్గడేర్ వద్ద అదుపుతప్పి అదుపుతప్పి చీనాబ్ నదిలో పడింది. ప్రమాదసమయంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో అంతా మృతి చెందినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications