న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న నానో కారు త్వరలోనే మార్కెట్లో దర్శనమివ్వనుంది. టాటా మోటర్స్ వారు..తమ నానో కారును మార్చి 23న ముంబయిలో లాంఛనంగా ప్రవేశపెడతామని ఏప్రిల్‌నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని తెలియజేసింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ కారుని బుక్ చేసుకోవచ్చునని తన ప్రకటనలో తెలియచేసింది. ఏప్రిల్ మొదటివారంలో ఈ కారును టాటా షోరూముల్లో డిస్‌ప్లేకు ఉంచుతామని, రెండవవారంలో బుకింగ్స్ ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలో అత్యంత తక్కువ రేటుకే (లక్షకే) లభిస్తుందంటూ ప్రచారం పొందుతున్న ఈ కారు బుకింగ్స్ కూడా సంచలన రీతిలో ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.