జూబ్లీహిల్స్ నుంచి మురళీమోహన్?

పార్టీ ఆడియో క్యాసెట్ల ఆవిష్కరణ నిమిత్తం మురళీమోహన్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చారు. కానీ ఈ విషయాలేవీ ఆయన ప్రస్తావించలేదు. రాజమండ్రి లోక్‌సభ స్థానానికి కూడా ఆయన పేరును అక్కడి నేతలు ప్రతిపాదిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మురళీగౌడ్, కాజ సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ గౌడ్, సదాశివ యాదవ్ పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి.
నగరానికి చెందిన తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీల సమావేశాలు శుక్రవారం జరిగాయి. సనత్ నగర్‌కు మాజీ ఎమ్మెల్యేలు శ్రీపతి రాజేశ్వర్, కాట్రగడ్డ ప్రసూనలతోపాటు ఇటీవల ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయిన పీఎల్ శ్రీనివాస్ పేరూ ప్రస్తావనకు వచ్చింది. తమకు సికింద్రాబాద్ లోక్‌సభ స్ధానంపై కూడా ఆసక్తి ఉందని ప్రసూన, పిఎల్ శ్రీనివాస్ వెల్లడించారు. ఖైరతాబాద్‌కు కె.విజయరామారావు, మాగంటి గోపినాథ్, బి.ఎన్.రెడ్డి, విజయకుమార్, మలక్‌పేట నియోజకవర్గానికి అస్లాం, ముజాఫర్, అమరేందర్ గౌడ్, లలిత, ప్రభాకర్‌రెడ్డి, కోటేశ్వరరావుల పేర్లు పరిశీలనకు వచ్చాయి.
ఎల్.బి.నగర్ నియోజకవర్గానికి ఎస్వీ కృష్ణ ప్రసాద్, వజీర్ ప్రకాశ్, గజ్జెల మధుసూధనరెడ్డి, ఉప్పల్‌కు తెలుగు విద్యార్థి అధ్యక్షుడు నర్సిరెడ్డి, పార్టీ నేతలు రమణారెడ్డి, భాస్కర్, యాదవరెడ్డి, వంశీరాజు మలేశ్ పేర్లను ప్రతిపాదించారు. అంబర్‌పేటకు దుర్గాప్రసాద్‌రెడ్డి, వనం రమేశ్, పులి జగన్, లక్ష్మణ్‌గౌడ్, కుత్బుల్లాపూర్‌కు లింగం గౌడ్, బూర్గుబావి హనుమంతరావు, వెంకటేశం పేర్లు ప్రతిపాదనకు వచ్చాయి.












Click it and Unblock the Notifications