తల నరుక్కుంటామే గానీ.. కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణా సాధన కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్దంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష్యుడు కె.చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణా సాధన కోసం తెలెత్తుకుని ఉద్యమిస్తామని, ఒక వేళ తలదించుకోవలసి వస్తే తల నరుక్కుంటామే గాని లొంగిపోమని ఆయన తెలిపారు. తెలంగాణా రాష్ట్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి సైద్దాంతికంగా అభ్యంతరం లేదు' అన్న సోనియా ప్రకటన మతిలేని మాటలుగా టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ఈ రోజు (ఆదివారం) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోశయ్య కమిటీ ఒక మెంటల్ హాస్పిటల్ కమిటీగా కెసిఆర్ వ్యాఖ్యానించారు. అలాగే చర్చల పేరుతో నక్సల్స్ ను, తెలంగాణా పేరుతో తెరాసను, వర్గీకరణ పేరుతో మాదిగలను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మోసం చేశారని ఆయన అన్నారు. గాంధీభవన్ దాడిలో గాయపడి మృతి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు సురేందర్ మాదిక మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మార్పీఎస్ కు వైఎస్ క్షమపణ చెప్పాలని కెసిఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణా విషయంలో కూడా ఇలాంటి భావోద్వేగ సంఘటనలు జరగొచ్చని ఆయన తెలిపారు. సోనియా గాంధీ పెరేడ్ గ్రౌండ్ నుండి పారిపోవచ్చుగాని, ప్రజా క్షేత్రం నుండి పారిపోలేరని కెసిఆర్ వ్యాఖ్యానించారు. మాదిగలు ఆత్మాహుతులకు పాల్పడడం కాదు, హత్యలు చేయడానికి సిద్దపడాలి. వర్గీకరణ కోసం గాంధీభవన్ నే కాదు, సోనియా నివాసాన్నైనా తగలబెడతామని కెసిఆర్ హెచ్చరించారు.ఆయన ఆదివారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేట, భువనగిరిలో ఏర్పాటు చేసిన తెరాస శిక్షణా తరగతులకు ఆయన హాజరవుతారు.












Click it and Unblock the Notifications