టీఆర్ ఎస్ సెక్రటరీ గా విజయశాంతి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్‌గా విజయశాంతి ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఆమె పదవీ ప్రమాణం చేశారు.ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ ఛీప్ కెసిఆర్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజానీకాన్ని పదే పదే మోసం చేస్తోన్న కాంగ్రెస్‌ను తరమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్‌గా, సెక్రెటరీ జనరల్‌గా విజయశాంతి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ ఎటూతేల్చకుండా దాటవేత వైఖరి ప్రదర్శించడం వల్లే దాడి ఘటన, కార్యకర్త మృతికి దారితీసిందని ఆయన దుయ్యబట్టారు. శాంతియుతంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంఎమ్మార్పీఎస్ ఉద్యమం వలే మారితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications