ఏప్రిల్ 16 నుంచి రాష్ట్రంలో ఎన్నికలు

Gopalaswamy
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘ ప్రకటించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల అధికారి ఎన్‌.గోపాలస్వామి ఎన్నికలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్‌ 16న తెలంగాణ, ఉత్తరాంధ్రలలో ఏప్రిల్‌23న ఎన్నికలు రాయలసీమ, మధ్య ఆంధ్రాలలో నిర్వహిస్తామని గోపాలస్వామి తెలపారు. ఏప్రిల్‌ 16న 124 లోక్‌ సభ నియోజక వర్గాల్లో, మొదటిదశ ఏప్రిల్‌23న 141 లోక్‌ సభ నియోజకవర్గాల్లో, రెండోదశ ఏప్రిల్‌ 30న 107 లోక్‌సభ నియోజక వర్గాల్లో, మూడోదశ మే 7న 85 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు అఫిడవిట్‌లు అందజేయాల్సి ఉంటుంది. ఒకటి ఆస్తులకు సంబంధించిన వివరాలు, రెండు క్రిమినల్‌ కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలి. దీంతో ఈ రోజు సాయింత్రం నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది.

ఈ ఎన్నికలు మొత్తం అయిదు దశల్లో జరుగుతాయని ఆయన తెలిపారు. తొలి దశ ఎన్నికలు ఏప్రిల్‌ 16న ప్రారంభమవగా, మే 13న చివరిదశ ఎన్నికలు జరుగుతాయి. జూన్‌ 2 లోగా 15వ లోక్‌సభను ఏర్పాటు చేస్తారు. ఈ సారి ఎన్నికల్లో మొత్తం 71.10కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 40లక్షల మంది పోలింగ్‌ సిబ్బంది పనిచేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+