హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ - సిటీ బస్సుల రూట్లు మార్పు, స్టేజీలు ఇక ఇలా..!!
హైదరాబాద్ లో నిత్యం వేలాది మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. తాజాగా సిటీ లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పనులు మొదలు పెట్టారు. అందులో భాగంగా అమలు చేస్తున్న వన్-వే నిబంధనలతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ ఆరీస్టీ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్సు రూట్లలో మార్పులు చేస్తూ, స్టాప్‌లు, స్టేజీల వివరాలను అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ వద్ద ఒన్ వే అమలు చేస్తున్నారు. దీంతో, పలు సిటీ బస్సుల మార్గాల్లో మార్పులు చేసారు. మారిన బస్సు రూట్లు, స్టాప్‌ల ఆధారంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడిపించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మణికొండ మార్గంరలోని బస్సులు సికింద్రాబాద్- బేగంపేట- నాగార్జున సర్కిల్ - ఎల్‌వీ ప్రసాద్- బసవతారకం హాస్పిటల్- బీఆర్‌ఎస్ భవన్- ఎమ్మెల్యే కాలనీ- ఒమేగా- అపోలో ఆస్పత్రి- ఫిల్మ్‌నగర్- దర్గా- మణికొండ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. అదే విధంగా మణికొండ నుంచి సికింద్రాబాద్: మణికొండ- పంచవటికాలనీ, దర్గా- ఫిల్మ్‌నగర్ - జర్నలిస్ట్ కాలనీ- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్- అన్నపూర్ణ స్టూడియో- ఎల్‌వీ ప్రసాద్ హాస్పిటల్- టీవీ9 (మసీద్)- పంజాగుట్ట పీఎస్- ఆర్‌జే కాలేజీ- పోలీస్ లైన్- ప్లాజా- సికింద్రాబాద్‌గా సాగనున్నాయి.

ప్రయాణీకులకు సూచనలు
ఇక, బస్సు నంబరు 222 కోఠి నుంచి పటాన్‌చెరు: కోఠి- లక్డీకాపూల్- మాసబ్‌ట్యాంక్- నాగార్జున సర్కిల్- ఎల్‌వీ ప్రసాద్- బసవతారకం హాస్పిటల్- బీఆర్‌ఎస్ భవన్- ఎమ్మెల్యే కాలనీ-ఒమేగా- ఆపోలో ఆస్పత్రి- జర్నలిస్ట్ కాలనీ- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్- పెద్దమ్మగుడి - మాదాపూర్ పీఎస్- పటాన్ చెరు మీదుగా.. అదే విధంగా పటాన్‌చెరు నుంచి కోఠి: పటాన్‌చెరు- మాదాపూర్ పీఎస్- పెద్దమ్మగుడి- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్- అన్నపూర్ణ స్టూడియో- ఎల్‌వీ ప్రసాద్- నాగార్జున సర్కిల్- మాసబ్‌ట్యాంక్ - లక్డీకాపూల్- కోఠి మీదు నడుస్తాయి. కాగా.. కోఠి నుంచి కొండాపూర్ : కోఠి- లక్డీకాకపూల్ - మాసబ్‌ట్యాంక్- పెన్షన్ ఆఫీస్ - ఎమ్మెల్యే కాలనీ- అపోలో ఆస్పత్రి- రోడ్డు నంబర్ 45 - మాదాపూర్ పీఎస్- కొండాపూర్ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.












Click it and Unblock the Notifications