40 కోట్లకు జనాన్ని ముంచి పరార్
రాజమండ్రి: రాజమండ్రి, దవళేశ్వరంలో నివశించే నాగ శ్రీనివాసరావు లక్ష రూపాయలకు నెలకు ఆరువేల రూపాయలు వడ్డి ఇస్తానని స్థానిక ప్రజలను నమ్మించి 40 కోట్ల రూపాయలు దండుకుని కుటుంబంతో సహా పరారయ్యాడు. గత రాత్రి వెలుగులోకి వచ్చింది. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం....ధవళేశ్వరంలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు రైల్వే ఉద్యోగి, వాలంటీర్ రిటైర్‌మెంటు తీసుకుని వచ్చిన డబ్బుతో ఎం.ఎన్.కన్సాల్టెంట్ పేరుతో వ్యాపారం ప్రారంభించాడని, లక్ష రూపాయలకు ఆరువేల రూపాయలు వడ్డీ ఇస్తానని స్థానికులను నమ్మించి దాదాపు 40 కోట్ల రూపాయలు సేకరించాడని, నమ్మకం కలిగించడానికి కొందరికి చెప్పిన విధంగా వడ్డీ ఇచ్చాడని, ఒక్కసారిగా శ్రీనివాసరావు కనిపించకుండా పోయేసరికి బాధితులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. బాధితులు ఫిర్యాదుమేరకు శ్రీనివాసరావుపై 420 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications